టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాలో జరుగుతున్న మూడో టెస్టు లో హాఫ్ సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ… దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో టీమిండియా వాల్ రాహుల్ ద్రావిడ్ రికార్డును బ్రేక్ చేశాడు. సఫారీ గడ్డపై రాహుల్ ద్రావిడ్ 11 టెస్టుల్లో 624 పరుగులు చేయగా.. తాజాగా ఇన్నింగ్స్ తో కోహ్లీ అధిగమించాడు.
14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ కోహ్లీ… ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశౄడు. ఇక ఈ జాబితాలో దిగ్గజ బ్యాట్స్ మెన్ సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్ ల్లో 1161 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికాలో ఇప్పటి వరకు 7 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ.. 50 కి పైగా సగటుతో 688 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే.. సచిన్ రికార్డు బద్దలు కొట్టాలంటే.. మరో 500 + పరుగులు విరాట్ కోహ్లీ చేయాల్సి ఉంటుంది.