రేవంత్, చంద్రబాబుకు ప్రపంచయాత్రికుడు అన్వేష్ స్పెషల్ రిక్టెస్ట్..

-

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డికి ప్రపంచయాత్రికుడు.. నాఅన్వేషణ యూట్యూబర్ అన్వేష్ స్పెషల్ రిక్టెస్ట్ చేశారు. బెట్టింగ్ యాపుల పేరుతో కోట్లు సంపాదించుకుని సామాన్య ప్రజల, యువత ఆత్మహత్యలకు కారణమవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో భయ్యా సన్నీయాదవ్, బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్, ఇమ్రాన్ వీరితో పాటు ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్, భయ్యా సన్నీయాదవ్, హర్ష సాయిలపై పోలీసులు కేసు నమోదు చేయగా.. మిగతా వారిని కూడా వదిలిపెట్టవద్దని అన్వేష్ ఇరు రాష్ట్రాల సీఎంలను వేడుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news