ప్రాణహిత చేవెళ్ల పాత నమూనాతోనే ముందుకు : మంత్రి ఉత్తమ్

-

ప్రాణహిత చేవెళ్ల పాత నమూనాతోనే ముందుకు తీసుకెళ్తామని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం మార్చివేసిందని.. తాము మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి మళ్లీ పాత నమూనాతోనే ముందుకెళ్తామని చెప్పారు.

త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిపి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో చాలా పొరపాట్లు చేసిందన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఏపీ వాళ్లు అధికంగా నీటిని తీసుకెళ్తుంటే పట్టించుకోలేదని.. వాళ్లతో చర్చలు ఉంటే కేసీఆర్ చేపల పులుసు తాగి వచ్చాడని గుర్తు చేశారు. తాము చంద్రబాబు వద్ద ఎలాంటి పులుసు తాగలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news