ఐశ్వర్యం కలగాలంటే శనీశ్వరుడిని ఇలా పూజించండి..!

-

శని అంటే అందరూ భయపడతారు. మన జాతకంలో శని ప్రభావం ఉండకూడదని కూడా కోరుకుంటూ ఉంటాము. ఏలినాటి శని, అష్టమ శని అంటే అందరూ భయపడిపోతుంటారు. అయితే శనీశ్వరుడిని పూజించడం కూడా చాలా మంచిది. ఈ విధంగా పూజిస్తే ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

 

నిజానికి శనీశ్వరుడిని పూజించే వాళ్ళు చాలా తక్కువ. కొంత మంది అయితే దేవాలయాల్లో పూజిస్తారు కానీ ఇంట్లో శని విగ్రహాన్ని ఉంచరు. అయితే నిజానికి శనీశ్వర అని శనిదేవుడిని పిలవాలి. ఈశ్వర అంటే ఐశ్వర్యం వస్తుంది. నవగ్రహాల మండపానికి వెళ్ళినప్పుడు శనీశ్వరుడుని భక్తితో పూజించాలి. భక్తిగా నమస్కరించటం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది.

శనివారం నియమాలను పాటించడం వల్ల మంచి కలుగుతుంది. శనీశ్వరుడిని పూజించేటప్పుడు నీలం లేదా నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది. అలానే చిమ్మిలి నైవేద్యంగా సమర్పిస్తే దేవుడు అనుగ్రహిస్తాడు. శనీశ్వరుడు కొద్దిగా పీడించడం జరిగింది అంటే దానికి వందరెట్లు యోగం, ఐశ్వర్యం ఇచ్చి వెళ్తాడు శనీశ్వరుడు. శనీశ్వరుడి ప్రభావం కోరుకోకపోతే యోగం ఐశ్వర్యం కూడా దక్కదు.

కొద్దిగా శనీశ్వరుడు పీడిస్తేనే మంచిదట. వందరెట్లు ఐశ్వర్యాన్ని కలిగించాలని భక్తిశ్రద్ధలతో మనం కోరుకోవాలి. నీలం రంగు పుష్పాలతో శని దేవుడుని పూజించాలి. అలానే శివారాధన, హనుమంతుడికి పూజ, అయ్యప్ప స్వామి కి పూజ చేస్తే మంచిది. శని దేవుడికి పూజ చేసేటప్పుడు శని వైపు చూడకూడదు. అలానే ఎదురుగా నిలబడి చూడకూడదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడకూడదు. కేవలం ఆయన పాదాలను మాత్రమే చూసి పూజించాలి. ఇలా శనీశ్వరుడికి పూజ చేసేటప్పుడు వీటిని పాటించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version