IPL 2022 : హ‌ర్ధిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయం : హ‌ర్భ‌జ‌న్ సింగ్

-

ఐపీఎల్ 2022 గ‌త కొద్ది రోజుల నుంచి క్రికెట్ ప్రేమికుల‌ను అల‌రిస్తుంది. భారీ సిక్స్ లు, మెరుపు ఇన్నింగ్స్ ల‌తో ఈ పొట్టి టోర్నీ దుమ్ములేపుతుంది. ఈ ఏడాది ఐపీఎల్ కు కొత్త‌గా వ‌చ్చిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్, గుజ‌రాత్ టైటాన్స్ కూడా క్రికెట్ ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా గుజ‌రాత్ టైటాన్స్.. అంచ‌నాలకు మించి రానిస్తుంది. ఫామ్ లేడు అంటూ.. హర్ధిక్ పాండ్యాను విమ‌ర్శించిన వారే ముక్కును వేలేసుకుంటున్నారు. హ‌ర్ధిక్ పాండ్యా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ తో పాటు కొత్త‌గా కెప్టెన్సీలో కూడా రాణిస్తున్నారు.

గుజ‌రాత్ టైటాన్స్ ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్ లు ఆడి.. అన్నింట్లో గెలిచింది. ఓట‌మి ఎర‌గ‌ని జ‌ట్టుగా ఉంది. దీంతో హ‌ర్ధిక్ పాండ్యా పై ప‌లువ‌రు సీనియ‌ర్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజా గా టీమిండియా మాజీ ఆట‌గాడు.. హ‌ర్భ‌జ‌న్ సింగ్ కూడా హ‌ర్ధిక్ పాండ్యా పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్ తో హ‌ర్ధిక్ పాండ్యా రాణిస్తున్నాడ‌ని అన్నాడు. ఇలాగే ఆడితే.. టీమిండియా కు పాండ్యా రీ ఎంట్రి ఇవ్వ‌డం ఖాయం అని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version