ధనం మూలం ఇదం జగత్. అదే సమయంలో ధనంతోపాటు ఆనందంగా ఉండాలి అని కోరకుంటారు ప్రతి ఒక్కరు. జీవితానికి ధనం అదేనండి ఐశ్వర్యం, ఆనందం రెండు ముఖ్యమే. దీనికోసం పెద్దలు అనేక పరిష్కారాలు చెప్పారు వాటిలో కొన్ని తెలుసుకుందాం..
అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.
ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.
ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. త్వరలోనే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అదేవిధంగా నిత్యం భక్తితో శ్రీలక్ష్మీ అష్టోతరం, కనకధార స్తోత్రం, శివాభిషేకం, మారేడుతో శివ పూజ వంటివి అవకాశం ఉన్నప్పుడుల్లా చేయాలి. పేదలకు, వికలాంగులకు సహాయం చేయాలి.
మారేడు దళాలతో శివుడిని ఎందుకు పూజించాలి…?
ఇలా శివలింగానికి పూజ చేస్తే ఎన్నో లాభాలు పొందొచ్చు
– శ్రీ