అగ్ని పథకాన్ని సమర్థించుకునేందుకు బీజేపీ నేతలు చేస్తున్న అర్ధరహిత, అవమానకరమైన వ్యాఖ్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అగ్ని వీరులకు బట్టలు ఉతకడం, కటింగ్ చేయడం లాంటి పనులు నేర్పుతానని… సైన్యం నుంచి బయటకు వచ్చాక వారికి ఈ నైపుణ్యాలు ఉపయోగపడతాయని తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఈ తరుణంలోనే తాజాగా బిజెపి ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ ఆఫీస్ లో సెక్యూరిటీ గార్డు ను నియమించాలని అనుకుంటే తాను అగ్ని వీరులకి ప్రాధాన్యం ఇస్తానని హాట్ కామెంట్స్ చేశారు.
ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. యువత సైన్యంలో చేరేది దేశానికి సేవ చేయడానికి అని.. బిజెపి పార్టీ ఆఫీసులకు సెక్యూరిటీ గార్డులుగా మారడానికి కాదని విపక్షాలు మండిపడ్డాయి. అగ్నిపర్వత కార్యక్రమం వెనుక అసలు ఉద్దేశాన్ని విజయవర్గియ తేటాతెల్లం చేశారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.