రోజురోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు వేసిన మృగాళ్ల వెన్నులో మాత్రం వణుకు పుట్టడం లేదు. అయితే ఓ ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో వంచించి.. లొంగతీసుకున్నాడు ఓ దుర్మార్గుడు.. అంతేకాకుండా తనతో శృంగారం చేసేటప్పుడు వీడియో చిత్రీకరించి.. బ్లాక్ మెయిల్‌కు దిగాడు. ఆ వీడియోలు అడ్డుపెట్టుకొని పలుమార్లు ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా తన సొదరుడితో కూడా పడుకోవాలని లేకుండా నగ్న వీడియోలు బయటపెడుతానంటూ బెదిరించేసరికి వేధింపుతు తాళలేక తల్లికి విషయాన్ని చెప్పి బొరున విలపించింది సదురు విద్యార్థిని. దీంతో బాలిక తన తల్లికి మొత్తం విషయం చెప్పేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. రాజస్థాన్‌లోని అల్వార్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 12వ తరగతి చదువుతోంది.
ఆమెకు కొన్ని నెలల కిందట ఓ యువకుడు పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. చివరకు ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఆ ఘటనను నిందితుడు ఫోన్ కెమెరాలో బంధించాడు. ఆ వీడియో చూపించి ఆ బాలికను బెదిరించడం ప్రారంభించాడు. ఆ తర్వాత కూడా ఆ బాలికపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు తన సోదరుడితో కూడా శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆ బాలికపై ఒత్తిడి తేవడం ప్రారంభించాడు. దీంతో ఆ బాలిక మొత్తం విషయాన్ని తన తల్లికి చెప్పేసింది. తల్లి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.