ఐటి కంపెనీలతో ఇప్పటికే ఇండియా సిలికాన్ వ్యాలీ అనిపించుకున్న తెలంగాణా… మరోసారి అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైస్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసిన తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్-–15048) వరికి అంతార్ఝాతీయ గుర్తింపు లభించడం విశేషం. ఈ విశ్వ విద్యాలయం అభివృద్ధి చేసిన ఆర్‌ఎన్‌ఆర్-–15048 వరిపై “జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రీషన్” అనే అమెరికా మీడియా కథనం రాసింది.
ఈ వారికీ అద్భుత లక్షణాలు ఉన్నాయని సదరు కథనంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిరుధాన్యాలైన జొన్నలు, సజ్జలు,రాగులు,కొర్రలు ఉండే స్థాయిలోనే వీటిలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని పేర్కొన్న ఆ సంస్థ వివరించింది. ఎంటీయు1010(ఫీమేల్), జేజీఎల్3855(మేల్)లను క్రాసింగ్ చేసి ఈ వరి వంగడాన్ని అభివృద్ధి చేసారు. ఆర్‌ఎన్‌ఆర్-–15048లో గ్లూకోజ్ శాతం కేవలం 51.6 మాత్రమే ఉండడంతో తినే వారికి షుగర్ రాదు.
తెలంగాణ సోనా కేవలం 125 రోజుల్లోనే చేతికి రావడంతో వరిని ఎక్కువగా పండించే దేశాలు దీనిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి. హైదరాబాద్ తార్నాకలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) సంస్థ కూడా పరిశోధించి వీటిలో ప్రోటీన్ (8.76 శాతం) తో పాటు బీ2, బీ3 విటమిన్ లు కూడా ఉన్నాయని, ఈ బియ్యాన్ని తినడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని గుర్తించింది. ఈ వరి వంగడం అంతర్జాతీయ గుర్తింపు పోందడంపై సిఎం కేసీఆర్ కూడా హర్షం వ్యక్తం చేసారు. ఈ లైసెన్స్ కోసం ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణా రావడం విశేషం.