ధర్మశాల వన్డేకు వర్షం అడ్డంకి.. చిత్తడిగా మారిన గ్రౌండ్‌..

-

ధర్మశాలలోని హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో గురువారం భారత్‌, సౌతాఫ్రికాల మధ్య జరగాల్సిన మొదటి వన్డే మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. మ్యాచ్‌కు ముందు కొంత సేపు వర్షం కురవడంతో గ్రౌండ్‌ చిత్తడిగా మారింది. దీంతో ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉందని అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. మధ్యాహ్నం 1.15 గంటలకు మైదానాన్ని పరిశీలించిన అనంతరం అంపైర్లు నిర్ణయం తీసుకోనున్నారు.

కాగా కివీస్‌లో వన్డే, టెస్టు సిరీస్‌లలో క్లీన్‌ స్వీప్‌కు గురైన భారత్‌ కనీసం స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలోనే భారత కెప్టెన్‌ కోహ్లి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు సమాచారం. ఇక నేటి మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారనున్న నేపథ్యంలో ఇరు జట్లూ వాతావరణ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. అయితే ప్రస్తుతం ధర్మశాలలో వర్షం కురవడం లేదు.. కానీ మ్యాచ్‌ ఆరంభమయ్యాక మధ్యలో ఆటకు వర్షం అడ్డంకిగా మారుతుందని వాతావరణ కేంద్రం చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version