వామ్మో .. వంటలక్క ఇంత రిచ్చా..!!

-

వంటలక్క.. కార్తీకదీపం సీరియల్ పేరు పెద్దగా చెప్పకపోయినా వంటలక్క అనగానే ప్రతి ఒక్కరికి కార్తీకదీపం సీరియల్ గుర్తొచ్చేస్తుంది. అంతలా ఈ సీరియల్ లో ఒదిగిపోయింది ప్రేమీ విశ్వనాథ్. టీవీ రంగంలో కార్తీకదీపం సీరియల్ ఒక బాహుబలి లాంటిది. ఐదు సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది ఈ సీరియల్ . ముఖ్యంగా ఈ సీరియల్ లో దీప పాత్రలో చేస్తున్న ప్రేమీ విశ్వనాథ్ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అందుకే ఈ పాత్ర పై సోషల్ మీడియాలో చాలా మీమ్స్ కూడా వస్తుంటాయి. అయితే కొన్ని రోజుల పాటూ ఈమె పాత్ర తీసేయడంతో సీరియల్ టిఆర్పి రేటింగ్ కూడా తగ్గిపోయింది. కానీ మేకర్స్ మళ్లీ కొత్త కథనంతో ఆ పాత్రను ప్రవేశపెట్టారు. దీన్నిబట్టి చూస్తే ఆమె ఏ రేంజ్ లో పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని సినిమాలలో వంటలక్క పేరుతో కామెడీ ట్రాకులు కూడా పండించారు. ఈ పాత్ర పోషించింది మలయాళ నటి ప్రేమీ విశ్వనాధ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సీరియల్ లో నటిస్తుంది కదా అని ప్రేక్షకులు ఈమె పై కొంత చిన్న చూపు ఉండొచ్చు కానీ ఈమె ప్రాపర్టీ తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. ఇటీవల కాలంలో చాలామంది బుల్లితెర ఆర్టిస్టులు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చి బిగ్ బాస్ కు వెళ్లి అటు తర్వాత వెండితెరకు దగ్గర అవ్వాలని భావిస్తున్నారు. కానీ ప్రేమీ విశ్వనాథ్ మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదు . అందుకు కారణం కూడా ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ప్రేమీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. నాకు కేరళలో రెండు స్టూడియోలు ఉన్నాయి. అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంటాయి. హైదరాబాద్కు కేవలం కార్తీకదీపం షూటింగ్ కోసం మాత్రమే వస్తాను. షూటింగ్ పూర్తవగానే అక్కడికి వెళ్ళిపోతాను.. సో నాకు అంత టైం ఉండదు. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి.. నేను మోడల్ గా కెరియర్ మొదలు పెట్టాను. సీరియల్ లో అమాయకంగా కనిపించినా.. బయట మాత్రం నేను రెబెల్ అంటూ చెప్పుకొచ్చింది . ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version