టీం ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య జరుగబోయే ఫైనల్ మ్యాచ్ కు వర్షం విలన్ గా మారింది. మ్యాచ్ జరిగే సౌతాంప్టన్ లో నిన్న ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో పిచ్ ను మైదానంలో కొంత భాగాన్ని కవర్లతో కప్పారు గ్రౌండ్ సిబ్బంది. మ్యాచ్ ఆరంభానికి గంట ముందే అంపైర్లు మైదానాన్ని లోకి వెళ్లి పరీక్షించారు. అయితే జల్లులు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. టాస్ పడకముందే మ్యాచ్ మొదటి సెషన్ రద్దు అయింది. ఈ మేరకు బిసిసిఐ కీలక ప్రకటన చేసింది.
ఇక వరుణుడు కరుణిస్తే గాని రెండో సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కాగా 144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రను సమున్నత స్థాయిలో నిలిపేందుకు భారత్-న్యూజిలాండ్ జట్లు రెడీ అయ్యాయి. కోహ్లీ ఆధ్వర్యంలో తొలి ఐసీసీ ట్రోఫీ కోసం భారత్ ఎదురుచూస్తోంది. రెండేళ్ల నుంచి ప్రత్యర్థులపై అద్భుత పోరాటంతో గెలుస్తూ డబ్ల్యూటీసీ ఫైనల్ దాకా చేరిన వేళ ఈ ఆఖరి సమరంలో అమీతుమీ తేల్చుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది.