షియోమీ సంస్థ రెడ్‌మీ ( Redmi ) బ్రాండ్ పేరిట ఓ నూతన ల్యాప్‌టాప్‌ను భారత్‌లో విడుదల చేసింది. రెడ్‌మీ బుక్ ప్రొ 15, రెడ్‌మీ బుక్ ఇ-లెర్నింగ్ ఎడిషన్ పేరిట ఈ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేశారు. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉంది.
రెడ్‌మీ బుక్ ప్రొ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ కలిగిన డిస్ ప్లే ను ఏర్పాటు చేశారు. ఇంటెల్ కోర్ ఐ5 టైగర్ లేక్ హెచ్35 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇంటెల్ ఐరిస్ జి గ్రాఫిక్స్ ను అందిస్తున్నారు. 8జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్‌కు ముందు భాగంలో 720పి వెబ్ క్యామ్‌ను ఏర్పాటు చేశారు. 10 గంటల వరకు బ్యాటరీ లైఫ్ లభిస్తుంది.
రెడ్‌మీ బుక్ ఇ-లెర్నింగ్ ఎడిషన్‌లో ఇంటెల్ 11వ జనరేషన్ కోర్ ఐ3-1115జి4 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 256/512 జీబీ ఎస్ఎస్‌డీ ఆప్షన్లు ఇందులో లభిస్తున్నాయి. ఇక మిగిలిన ఫీచర్లు పైన తెలిపిన ల్యాప్‌టాప్‌లో మాదిరిగానే ఉన్నాయి.
రెడ్‌మీ బుక్ ప్రొ 15, రెడ్‌మీ బుక్ ఇ-లెర్నింగ్ ఎడిషన్ ఫీచర్లు
* 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* రెడ్‌మీ బుక్ ప్రొ – 3.4 గిగాహెడ్జ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, ఐరిస్ జి గ్రాఫిక్స్
* రెడ్‌మీ బుక్ ఇ-లెర్నింగ్ ఎడిషన్ – 3 గిగాహెడ్జ్ 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్
* 8జీబీ ర్యామ్, 256/512 జీబీ ఎస్ఎస్‌డీ, విండోస్ 10 హోమ్ ఎడిషన్
* మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2019 హోమ్ అండ్ స్టూడెంట్ ఎడిషన్
* హెచ్‌డీ వెబ్‌క్యామ్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ, ఎస్‌బీ కార్డు రీడర్, 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్
RedmiBook Pro 15, RedmiBook e-Learning Edition ల్యాప్‌టాప్‌ల గ్రే కలర్ ఆప్షన్‌లో లభిస్తున్నాయి. RedmiBook Pro ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.49,999 ఉండగా, RedmiBook e-Learning Edition ప్రారంభ ధర రూ.41,999గా ఉంది. ఆగస్టు 6 నుంచి ఈ ల్యాప్ టాప్‌లను కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులతో రూ.3500 వరకు క్యాష్ బ్యాక్ ను ఇస్తారు.