Xperia Ace III : Sony నుంచి 5జీ స్మార్ట్ ఫోన్.. కాస్ట్ చాలా తక్కువే..!

-

Sony Xperia Ace III స్మార్ట్ ఫోన్ జపాన్ లో విడుదల చేశారు. ఏస్2కి తర్వాత వర్షన్ గా ఈ ఫోన్ లాంచ్ అయింది. సాధారణంగా సోనీ అంటేనే మినిమన్ ఉంటుంది. అలాంటిది.. ఈ ఫోన్ సోని లాంచ్ చేసిన ఫోన్లలోనే అత్యంత చవకైనా 5జీ స్మార్ట్ ఫోన్.. బెస్ట్ ఫీచర్స్ తో ఇంత తక్కువ ప్రైజ్ కు రావడం అంటే మూములు విషయం కాదు.. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా..!

సోనీ ఎక్స్‌పీరియా ఏస్ 3 ధర..

4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను 34,408 జపనీస్ యెన్‌లుగా ..ఇండియాలో అయితే .రూ.20,500 నిర్ణయించారు.
బ్లాక్, బ్లూ, బ్రిక్ ఆరెంజ్, గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
జూన్‌లో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభం అయ్యాయి.

సోనీ ఎక్స్‌పీరియా ఏస్ 3 స్పెసిఫికేషన్స్..

ఇందులో 5.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది.
వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను ఫ్రంట్ కెమెరా కోసం అందించారు.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకునే వీలుంది..
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ68 వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
5జీ, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, వైఫై, బ్లూటూత్ వీ5.1, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా అందించారు.

కెమేరా క్వాలిటీ..బ్యాటరీ పవర్..

ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే.. 4500 ఎంఏహెచ్‌గా ఉంది. మనదేశంలో ఈ ఫోన్ లాంచ్ కానుందో లేదో తెలియరాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version