యాదాద్రి భువనగిరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో రెండు రోజుల క్రితం కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్థారణ అయింది. ఈ తరుణంలోనే… యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటన చేశారు. పోలీస్ పికెట్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు.

కిలో మీటర్ పరిధిలో ఉన్న నాటు కోళ్లు, బాయిలర్ కోళ్లను చంపేస్తున్నారు అధికారులు. 3 నెలల వరకు గ్రామంలో కోళ్ల పెంపకాలు చేయకూడదని అధికారులు సూచనలు చేశారు అధికారులు. దీంతో… యాదాద్రి భువనగిరి జిల్లాలో బర్డ్ ఫ్లూతో భయపడుతున్నారు.