ఏపీని గుండారాజ్ గా మార్చారు..కేంద్రం జోక్యం చేసుకోవాల్సిందే : యనమల

-

వైసీపీ సర్కార్‌ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల ఫైర్‌ అయ్యారు. వైసిపి ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే నిన్నటి విధ్వంస కాండ జరిగిందని.. పోలీసులతో కుమ్మక్కై లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కు వైసిపి పాల్పడిందని నిప్పులు చెరిగారు. గుండారాజ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చారని… ఇది కాన్సిట్యూషన్ మిషనరీ బ్రేక్ డౌన్ అని పేర్కొన్నారు.

ఏపిలో కాన్సిట్యూషన్ బ్రేక్ డౌన్ అయ్యిందనడానికి ఇంతకన్నా సాక్ష్యం అక్కర్లేదని… ఏపిలో తక్షణమే కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు యనమల. ఆర్టికల్ 356 వినియోగానికి ఇదే సరైన సమయమని… ప్రభుత్వమే కాన్సిట్యూషన్ మిషనరీ బ్రేక్ డౌన్ కు పూనుకుందన్నారు.

కాబట్టి ఆర్టికల్ 356వినియోగం మినహా మార్గాంతరం లేదని… ప్రభుత్వ ప్రోత్సాహం, పోలీసుల అండదండలతోనే వైసిపి ఈ నేరానికి-ఘోరానికి తెగించిందని నిప్పులు చెరిగారు. మొత్తం పోలీసు యంత్రాంగాన్నే ఒక పద్దతి ప్రకారం నిర్వీర్యం చేశారని… ప్రజల ఆస్తులు అమ్మేస్తుంటే ప్రశ్నించడం తప్పా..? అని నిలదీశారు. రాష్ట్రంలో యధేచ్చగా గంజాయి సరఫరా అవుతుంటే నిలదీయడం తప్పా..? ఇసుక కొరత సృష్టించి పేదల ఉపాధి దెబ్బతీస్తే ప్రశ్నించడం తప్పా..? అని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version