లోకేష్ ను టీడీపీ నాయకులు అంగీకరించడం లేదు…అవంతి షాకింగ్ కామెంట్స్…!

-

లోకేష్ ను చంద్రబాబు నాయకుణ్ణి చేయాలనుకుంటున్నారు అని కానీ దానికి టిడిపి నాయకులు అంగీకరించడం లేదని మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. రాజకీయాలు ఎంతగా దిగజారి పోతున్నాయనడానికి తాజా టిడిపి నాయకులు తీరు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో ఆశాంతి కల్పించాలని రెండున్నర ఏళ్లుగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు మనుషులు ఈ రోజు రెచ్చ కొట్టే తీరులో మాట్లాడారని అన్నారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాజకీయాల్లో లేవని…చంద్రబాబు కు ఇంట్లో సమస్య లు ఎక్కువయ్యాయని చెప్పారు.

ఆ సంక్షోభం దారి మల్లుంచేందుకు ఇలా మాట్లాడిస్తున్నారంటు అవంతి మండిపడ్డారు. చంద్రబాబు కొడుకు లోకేష్ ను నాయకుడ్ని చేయాలని అనుకుంటారు..కానీ టిడిపి నాయకులు పార్టీ లో అంగీకరించడం లేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. గంజాయి రవాణా కొత్త కాదు..ఇప్పుడు చిన్న సంఘటన పట్టుకుని రాజకీయం చేస్తున్నాని అవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి రెచ్చ గొడుతున్నారు….మూడు రాజధానులు వద్దన్నారు .ఆసరా ఆరు వేల కోట్లు వేస్తే భరించ లేక పోతున్నారు అంటూ అవంతి ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version