ఏపీలో జగన్ సర్కార్.. టీడీపీ పార్టీని టార్గెట్ చేస్తూనే ఉంది. వరుసగా టీడీపీ పార్టీ సీనియర్ నేతలను అరెస్ట్ చేస్తూనే.. ఆ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు చెక్ పెడుతోంది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా అన్న క్యాంటీన్లను ధ్వంసం చేసింది జగన్ సర్కార్. అనుమతులు లేవనే నేపంతో.. ధ్వంసం చేసింది జగన్ సర్కార్. అయితే.. దీనిపై నారా లోకేష్ నిప్పులు చెరిగారు.
పేదల నోటి దగ్గర కూడు లాక్కోవడానికి సిగ్గులేదా జగన్ రెడ్డి? అన్న క్యాంటీన్లు మూసేశారని ఆగ్రహించారు. మేం పేదలకు భోజనం పెడతామంటే ఒప్పుకోరని… మంగళగిరిలో పేదలకు రూ.2 కే భోజనం అందించడానికి ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్ కి అనుమతి లేదంటూ జగన్ రెడ్డి సర్కార్ కూల్చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకోవడానికి ఎన్ని కుయుక్తులు పన్నినా మంగళగిరిలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం ఖాయం. పేదలకు తక్కువ ధరకే భోజనం అందిస్తాం. ఎవడు అడ్డొస్తాడో చూస్తామని హెచ్చరించారు నారా లోకేష్.
పేదల నోటి దగ్గర కూడు లాక్కోవడానికి సిగ్గులేదా జగన్ రెడ్డి? అన్న క్యాంటీన్లు మూసేశారు. మేం పేదలకు భోజనం పెడతామంటే ఒప్పుకోరు. మంగళగిరిలో పేదలకు రూ.2 కే భోజనం అందించడానికి ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్ కి అనుమతి లేదంటూ జగన్ రెడ్డి సర్కార్ కూల్చేయడం అత్యంత హేయమైన చర్య.(1/2) pic.twitter.com/AzqFVgmcnS
— Lokesh Nara (@naralokesh) June 9, 2022