షుగర్ పేషంట్స్ మామిడిపండ్లు ఎక్కువగా తినడం మంచిది కాదు.. ఇది రక్తంలో చెక్కర స్థాయిలను అమాంతం పెంచేస్తుందని చాలా తక్కువ మోతాదులో తినమంటారు. అయితే.. మామిడి ఆకులు మాత్రం షుగర్ పేషంట్స్‌కు దివ్య ఔషధమే అని చెప్పాలి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుతాయట.
మామిడి ఆకులలో పెక్టిన్, విటమిన్ సి ,ఫైబర్ ఉంటాయి. ఇవి మధుమేహం ,అధిక కొలెస్ట్రాల్ నియంత్రణకు ఉపయోగపడతాయి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడే వారితో పాటు బరువు తగ్గాలనుకునే వారికి మామిడి ఆకులు మేలు చేస్తాయి. దీనివల్ల వేగంగా బరువు తగ్గుతారు. దృష్టి లోపం ఉన్నవారు మామిడి ఆకులను తీసుకుంటే మంచి మార్పు వస్తుందట.
మామిడి ఆకులను ఎలా తినాలి..?
10-15 మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించాలి. రాత్రిపూట అలాగే చల్లారడానికి వదిలివేయండి. రాత్రంతా అందులో మామిడి ఆకులను అలాగే ఉంటాయి..ఈ నీటిని ఉదయాన్నే వడకట్టి తాగాలి. ఈ నీటిని ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అయితే తీవ్రమైన మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈ రెమెడీని ఉపయోగించాల్సి ఉంటుంది.
చాలామంది మామిడిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతామని అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే.. మామిడి పండు ఆరోగ్యానికి చాలామంచిది. ఇది తినడం వల్ల.. బాగా డైజెషన్ అవుతుంది. స్కిన్ గ్లోయింగ్ ఉంటుంది. డైలీ వ్యాయామం చేస్తుంటే.. ఏం తిన్నా ఏం కాదు. షుగర్ పేషంట్స్‌కు మాత్రం.. మామిడి పండు కంటే.. ఆకులే ఎక్కువ మేలు చేస్తాయి. మామిడి ఆకులే కాదు.. జామ ఆకులతో కూడా డికాషన్ చేసుకుని తాగొచ్చు.దీని ద్వారా కూడా షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి..
అయితే షుగర్ పేషెంట్స్ ఎలాంటి హోమ్ రెమిడీస్ ఉపయోగించినా.. ఏదైనా ఒక్కటే ఎంచుకోవాల్సి ఉంటుంది. చెప్తున్నారు కాద అని.. అన్నీ టిప్స్ ఒకేసారి ఫాలో అయితే.. రక్తంలో చెక్కర స్థాయిలు పడిపోయి లేనిపోని అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది..టాబ్లెట్స్ వాడుతూ.. ఏదైనా ఒక రెమిడీ ట్రై చేస్తూ.. క్రమక్రమంగా టాబ్లెట్ మోతాదును తగ్గించుకుంటూ రావాలి. ఈ విధంగా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.!