ఒకపక్క రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నా, సిఎం వైఎస్ జగన్ ఎన్ని జాగ్రత్తలు చెప్పి ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి హెచ్చరికలు చేస్తున్నా సరే… అధికార వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేస్తున్నారు. చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణం వైసీపీ నేతలు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
ట్రాక్టర్ల ర్యాలీ సహా కొన్ని కార్యక్రమాలు వైసీపీ నేతలు చేస్తూ వచ్చారు. దీనితో కేసులు అత్యంత వేగంగా పెరిగాయి. విజయసాయి రెడ్డి… ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు తిరుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన తిరగడం వలనే కరోనా కేసులు వచ్చాయి అనేది విపక్షాలు చేస్తున్న ఆరోపణ. విడదల రజని, ఆర్కే రోజా, సహా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సమాజ సేవ చేస్తున్నారు.
అంత వరకు బాగానే ఉన్నా… సామాజిక దూరం పాటించాలి అని చెప్తున్నా సరే ఎవరూ కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. దీనితో జగన్ బాగా ఇబ్బంది పడుతున్నారు. తాను హెచ్చరిస్తున్నా వీరు మారడం లేదు అనే అభిప్రాయం జగన్ లో వ్యక్తమవుతుంది. శ్రీకాళహస్తి లో కేసులు పెరగడానికి వైసీపీ ఎమ్మెల్యే కారణమని ప్రధాన మీడియా లో వచ్చింది. 30 మంది వరకు కరోనా సోకింది. ఒక్క కేసు కూడా లేని చోట కేసులు పెరిగాయి.
ఇప్పుడు ఆయన హడావుడి చేస్తూ రోడ్ల మీద తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో కొందరు నేతలు సమావేశాలు పెడుతున్నారు. దీని వలన అంతిమంగా నష్టపోతుంది సిఎం వైఎస్ జగన్. ఆయన హెచ్చరికలు చేస్తున్నా సరే కొందరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.