ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ ని… ఆయన అభిమానులు ఎంత అభిమానిస్తారో గాని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాత్రం ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు. జగన్ ని చిన్న మాట అన్నా సరే ఆమె ఏ మాత్రం కూడా సహించే పరిస్థితి ఉండదు అనేది వాస్తవం. జగన్ ని ఏ మాట అన్నా సరే ఎవరిని అయినా సరే విమర్శించడానికి ఆమె వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు అనేది తెలుసు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆమె జగన్ తోనే ఉన్నారు.
వైఎస్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రోజా ఆ తర్వాత జగన్ వెంట నడిచారు. పార్టీ విపక్షంలో ఉన్న సమయంలో ఆమె చేసిన పోరాటం అందరికి తెలిసిందే. ఆమెనే ముందు మీడియా తో మాట్లాడే వారు ఏ విమర్శల చెయ్యాలన్నా సరే. అలాంటి రోజాకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినేట్ లో మాత్రం అవకాశం రాలేదు. దీనితో ఆమెకు కార్పోరేషన్ చైర్మన్ గా జగన్ అవకాశం ఇచ్చారు. దీనితో ఆమెకు కేబినేట్ హోదా దక్కింది.
ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి పదవులకు రాజీనామా చేయడానికి సిద్దమయ్యారు. వాళ్ళు ఇద్దరూ రాజ్యసభకు వెళ్ళడం తో మంత్రి పదవుల నుంచి తప్పుకుంటారు. వారి స్థానాలను భర్తీ చేసే క్రమంలో జగన్ రోజాకు అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయని అన్నారు. రోజా కూడా ఈసారి మంత్రి వర్గ కూర్పులో తనకు అవకాశం వస్తుంది అనుకున్నారు.
కాని అది సాధ్యం అయ్యే అవకాశాలు దాదాపుగా లేవు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. రోజా కాకుండా చిలకలూరిపేట ఎమ్మెల్యే గా ఉన్న విడదల రజనికి అవకాశం ఇవ్వాలని లేదా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. దీనిపై రోజా ప్రయత్నాలు చేస్తున్నా వారి ఇద్దరికీ విజయసాయి మద్దతు ఉందని అంటున్నారు. అందుకే రోజాకు అవకాశం లేదని అంటున్నట్టు సమాచారం.