లాక్‌డౌన్‌కు ఇప్ప‌ట్లో బ్రేక్ లేన‌ట్టే… అస‌లు ట్విస్ట్ ఇదే…!

-

దేశ‌వ్యాప్తంగా ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు, రెడ్ జోన్లు, క‌రోనా ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌స్తుతం లాక్‌డౌన్ ప‌టిష్టంగా అమ‌ల‌వుతోంది. ఎక్క‌డి క‌క్క‌డ ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విష‌యంలో క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. దీనివ‌ల్ల ప‌నులు ఆగిపోయాయి. ఉపాధి కూడా పో యింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 20 నుంచి కొంత మేర‌కు ఉప‌శ‌మ‌నం క‌ల్పించినా.. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల ప‌రిస్థితి ఏంటి?  నిజా నికి జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న‌ది, కార్మికులు ఎక్కువ‌గా ఉన్న‌ది, నిరుద్యోగులు ఎక్కువ‌గా ఉన్న‌ది కూడా ఈ రెండు ప్రాంతాల్లోనే. దీంతో ఇప్పుడు ఏ ఇద్ద‌రు మాట్లాడుకున్నా కూడా క‌రోనా లాక్‌డౌన్ ఇంకెన్నాళ్లు గురూ! అనే!! వాస్త‌వానికి కరోనా వైరస్‌ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగియనుంది.

అయితే, ఓవైపు లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలవుతున్నా.. పాజిటివ్‌ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. వైరస్‌ విరుగుడుకు ఇప్పటి వరకు సరైన ఔషధం లేకపోవడంతో.. సామాజిక దూరం, లాక్‌డౌన్‌తోనే కరోనాను కట్టడి చేయగలమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంక్షలను మరికొన్ని రోజులపాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నా యి. తెలంగాణలో విధించిన లాక్‌డౌన్‌ మే 7తో ముగియనుంది. అయితే ఆ తరువాత కూడా పరిస్థితి ఇలానే కొనసాగితే మరికొ న్ని రోజుల పాటు ఆంక్షలను కొనసాగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక దేశ వ్యాప్తంగా చూస్తే చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ కొనసాగింపుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

దీనిపై  ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ సర్కార్లు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతు న్నందున లాక్‌డౌన్‌ పొడిగింపు వ్యూహాన్నే అమలు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు మహారాష్ట్రలో పరిస్థితి మరిం త తీవ్రంగా ఉండటంతో లాక్‌డౌన్‌ తప్ప మరో దారి లేదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఒక్కసారిగా లాక్‌డౌన్‌ ఎత్తేస్తే పాజిటి వ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగి వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదే అభిప్రా యాన్ని గుజరాత్‌, రాజస్తాన్‌, తమిళనాడుతో పాటు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా వ్యక్తం చేస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయా ప్రభుత్వాలు చెబుతున్నాయి. మొత్తానికి దేశ వ్యాప్తంగా కూడా లాక్‌డౌన్‌ మరికొన్ని రోజుల పాటు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ణు ఎత్తివేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తు న్నారు.

ఇక‌, మ‌న ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఆదిలో తీవ్ర‌త త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ నానాటికీ కేసులు పెరుగుతున్నాయి. కీల‌క‌మైన రాజ‌ధాని జిల్లాలు గుంటూరు, కృష్ణాల్లోనే కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసుల సంఖ్య కూడా 1200ల‌కు చేరువ‌లో ఉంది. మ‌ర‌ణాలు కూడా 50కి చేరువ‌లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న ద‌గ్గ‌ర కూడా లాక్‌డౌన్ కొన‌సాగించే అవ‌కాశ‌మే క‌నిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. మే నెల 30 వ‌ర‌కు ఈ లాక్‌డౌన్ కొన‌సాగే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. సో.. దీనికి త‌గిన‌ట్టుగా.. మాన‌సికంగా సిద్ధం కావ‌డం త‌ప్ప స‌గ‌టు పౌరుడు చేయ‌గ‌లిగింది ఏమీ లేదు. బ‌తికి ఉంటే బ‌లుసాకు తినిబ‌త‌కొచ్చు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version