వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు.. జాగ్రత్తగా ఉండాలి :మాజీ మంత్రి ఆనం

-

ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ,అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు .ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీ కార్యకర్తలు సమన్వయం పాటించాలని మాజీ మంత్రి ఆనం సూచించారు.

ఎన్నికల కౌంటింగ్ ఏజంట్లతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు నేర్పించిన క్రమశిక్షణనే అనుసరిద్దామని సూచించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటింగ్ ప్రక్రియపై మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు, అధికారలు శ్రద్ధగా గమనించారని ,గొడవలు, తగాదాలు సృష్టించి కౌంటింగ్ ప్రక్రియని ఆలస్యం చేసేందుకు సజ్జల చూస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుసరించే విధానం, యావత్ భారత దేశానికి ఆదర్శం కావాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version