ఎన్నికల కౌంటింగ్..బండ్ల గణేష్ కు తీవ్ర అస్వస్థత

-

తాను ఏది అనుకుంటే అది నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడుతూ..బండ్ల గణేష్’ సోషల్ మీడియాలో నిత్యం హెడ్‌లైన్స్‌లో ఉంటూ వివాదాలకు కేంద్ర బిందువు అవుతాడు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. నిత్యం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటే ఉంటూ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే, రేపు రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం బండ్ల గణేష్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందజేస్తున్నారు.తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర అనారోగ్యంతో హస్పిటల్‌లో చేరడం సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళన గురవుతున్నారు.ఇదిలా ఉంటే… అయితే, ఒకవేళ కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తే మైక్ ముందు కాంగ్రెస్ తరఫున సవాళ్లు విసిరే నాయకుడు అందుబాటులో లేడే.. అన్న ఫీలింగ్‌లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version