ఏపీ పరిస్థితుల నేపథ్యం లో వైసీపీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీడీపీ పార్టీ వ్యవహరంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది వైసీపీ. టీడీపీ గుర్తింపు రద్దు చేయమని ఎన్నికల సంఘాన్ని కోరనుంది వైసీపీ. సోమవారం తర్వాత ఈసీకి లేఖ అందించనుంది వైసీపీ. ఈ లేఖ ద్వారా కీలకమైన అంశాన్ని లేవనెత్తనుంది వైసీపీ.
రాజకీయ పార్టీల నేతలు బూతులు మాట్లాడుతున్న అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్న వైసీపీ… పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఎన్నికల వేళ మాత్రమే నేతలు ఉపయోగించే భాష పై ఈసీ కట్టడి ఉంటుందని పేర్కొననుంది. ఆ తర్వాత నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా నియంత్రణ వ్యవస్థ లేని విషయాన్ని వివరించనున్న వైసీపీ… ఎన్నికల ప్రక్రియ లేని సందర్భాల్లోనూ నేతల భాషను ఈసీ కట్టడి కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరనుంది. తాజా టీడీపీ బూతుల ఎపిసోడ్ తో పాటు ఈమధ్య కాలంలో ఆ పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన మీడియా క్లిప్పింగ్స్, వీడియో ఫూటేజ్ ఆధారాలతో సహా ఇవ్వనుంది వైసీపీ.