టీడీపీ లో చాలా మంది మాకు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన అనిల్

-

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపైన చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. పొత్తులపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ సోమ‌వారం మాట్లాడుతూ.. టీడీపీకి చెందిన చాలా మంది సీనియ‌ర్ నేత‌లు వైసీపీ ఎమ్మెల్యేల‌తో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నార‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ విష‌యాన్ని తాను రుజువు చేయ‌గ‌ల‌న‌ని కూడా అనిల్ చెప్పారు గమనార్హం.

నెల్లూరుకు చెందిన రియ‌ల్ట‌ర్ కిన్నెర ప్ర‌సాద్‌కు తాను బినామీగా ఉన్నానంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించేందుకు సోమ‌వారం మీడియా ముందుకు వ‌చ్చిన అనిల్‌.. ఈ దిశ‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తానేమీ కిన్నెర ప్ర‌సాద్‌కు బినామీగా లేన‌ని ఆయ‌న వెల్ల‌డించిన అనిల్… టీడీపీ అధికారంలో ఉండ‌గా…కిన్నెర ప్ర‌సాద్ నాలుగు లే అవుట్లు వేశార‌ని అనిల్ చెప్పారు. మ‌రి నాడు మంత్రులుగా ఉన్న లోకేశ్ గానీ, నారాయ‌ణ గానీ కిన్నెర‌కు బినామీలుగా ఉన్నారా? అని ప్ర‌శ్నించారు అనిల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version