మొన్ననే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాజమండ్రి వేదికగా మహానాడు కార్యక్రమం జరిగింది. ఇందులో వచ్చే ఎన్నికల మ్యానిఫెస్టోను చూచాయగా చంద్రబాబు ప్రకటించారు. ఇందులో ప్రకటించిన అంశాల గురించి వైసీపీ ఎమ్మెల్యేలు దారుణంగా విమర్శిస్తూ ఎన్నికలు రాకుండానే ఓడిపోయేలా చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చంద్రబాబుకు బహిరంగ సవాలు విసిరారు. ఈయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలను ధనవంతులను చేస్తానని చంద్రబాబు అబద్దాలు చెబుతున్నాడని.. అంతే కాకుండా రాష్ట్రంలో సంపదను సృష్టిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నాడని విమర్శించారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు సవాల్… అప్పులపై బహిరంగ చర్చకు సిద్ధం !
-