జమ్మలమడుగు నియోజకవర్గంలో దాల్మియా సిమెంట్స్ పై పోరుబాటకి సిద్ధమయ్యారు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. మైలవరం మండలంలోని దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు అన్న రామసుబ్బారెడ్డి.. లోకాయుక్త కమిటీ నివేదిక ఇచ్చిన కూడా స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించడమే పెద్ద తప్పు. పై నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీ వల్ల రైతులు నష్టపోతున్నారు.
దాల్మియా యాజమాన్యం అహంకార ధోరణి కళ్ళకు కట్టినట్లుగా ఉంది. స్థానిక అధికారులను రైతులను, అక్కడ ఉన్న ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ పబ్బం గడుపుతున్నారు. దాల్మియా సిమెంట్స్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల కడుపు కొట్టి యాజమాన్యం ఆనంద పడుతున్నట్లు వ్యవహరిస్తుంది. అక్కడి రైతులు మా మద్దతు కోరారు. రైతులు తిరగబడితే ఎలా ఉంటుందో తెలిచివచ్చేలా చేస్తాం. ఇది ఏ పార్టీకి సంభందించిన పోరాటం కాదు.. ఇది రైతులకు మా మద్దతు మాత్రమే. స్వచ్ఛందంగా ఎవరైనా రావచ్చు.. రైతుకు అండగా నిలబడవచు అన్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి.