సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మీద పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల డైరీ చిల్లింగ్ సెంటర్‌ను సీజ్ చేయించి, తమ కడుపు మీద కొట్టినట్లు అన్నదాతలు ఆరోపిస్తున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లక్ష మంది పాల రైతులు, కుటుంబాలతో నడుస్తున్న సంస్థపై కలెక్టర్ అనాలోచిత చర్యలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం కరీంనగర్ రైతు పాల డైరీ చిల్లింగ్ సెంటర్‌ను కలెక్టర్ సీజ్ చేయించారు.గత 22 ఏళ్లుగా రైతులే ఓనర్లుగా ఉండి నడుపుకుంటున్న సంస్థపై కలెక్టర్ అక్కసు వెల్లగక్కారు. పర్మిషన్ లేదంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 20వేల లీటర్ల పాలు ట్యాంక్‌లో ఉండగానే వచ్చి అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. ప్రభుత్వం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరుపై పాడి రైతులు భగ్గుమంటున్నారు.
సిరిసిల్ల సైకో కలెక్టర్ మరో సైకో చర్య
పాల డైరీ చిల్లింగ్ సెంటర్‌ను సీజ్ చేయించి.. పాల రైతుల కడుపు మీద కొట్టిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లక్ష మంది పాల రైతుల కుటుంబాలతో నడుస్తున్న సంస్థపై అనాలోచిత చర్యలు
రాజన్న సిరిసిల్ల జిల్లా… https://t.co/B1UhKmmfsV pic.twitter.com/Ni9dUxqLNM
— Telugu Scribe (@TeluguScribe) February 20, 2025