చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి : మిధున్ రెడ్డి

-

మా తండ్రి పై భూకబ్జాలని, కుంబకోణం అని వార్తా కధనాలు ప్రచురిస్తున్నారు. ఈనాడు సంస్థ సంయమనం పాటించకుండా, వివరాలు తెలుసుకోకుండా వార్తా కధనాలు ప్రచురించడం అన్యాయం అని YCP ఎంపీ మిధున్ రెడ్డి అన్నారు. పుంగనూరు నియోజకవర్గం లోని మంగళంపేట లో వంద 75 ఎకరాలు కొన్నాం. ఆ భూమిలో షెడ్లు వేసి, కబాళాలకు వెళ్ళకుండా దేశీ ఆవులను సంరక్షిస్తున్నాం. చంద్రబాబు “డైవర్షన్ పాలిటిక్స్” లో భాగంగా మా పై బురద చల్లుతున్నారు. అది ప్రైవేట్ ల్యాండ్ అని రికార్డ్స్ చెపుతున్నాయి. ఆ భూమి ఎకరం విలువ నాలుగు లక్షల రూపాయలు మాత్రమే, మొత్తం భూమి విలువ 3 కోట్ల లోపే.

కానీ చంద్రబాబు కక్షసాధింపు తో వ్యవహరిస్తున్నారు. రకరకాల కేసులు పెట్టి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 1968 లోనే Central Govt గజెట్ లో ఫారెస్ట్ లాండ్ కాదని స్పష్టంగా ఉంది. 1981 లో “డైరెక్టర్ ఆఫ్ లాండ్ సెటిల్మెంట్” రెవిన్యూ రికార్డుల్లో కూడా అది అటవీ భూమి కాదని, పట్టా లాండ్ అని చాలా స్పష్టంగా ఉంది. కొంచెం కూడా ఆలోచన లేకుండా చంద్రబాబు ఆరోపణలతో, విచారణ అంటున్నారు. అనవసరమైన కేసులు పెట్టి, ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారని ఇష్టానుసారంగా వ్సవహరిస్తే, మాకు కూడా అవకాశం వస్తుంది. చేసే ఆరోపణలను చంద్రబాబు నిరూపించాలి, లేదా క్షమాపణలు చెప్పాలి. మమ్మల్ని విమర్శించే కొద్దీ ఇంకా బలంగా పోరాడతాం.. భయపడేది ఏమీ లేదు అని మిధున్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news