2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ బలోపేతం చేస్తాం…
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ లో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ దృష్టంతా ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంచడం సరైనదని పార్టీ భావించినట్లు పేర్కొన్నారు. అందుకే తెలంగాణలో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటనను సైతం విడుదల చేసింది.
2024 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని వివరించారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ నుంచి వైసీపీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచారు. తర్వాత వీరంతా టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కేడర్ ఉన్నప్పటికీ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు పార్టీ ప్రకటించడంతో వైసీపీ కార్యకర్తలు నిరాశకు గురైయ్యారు. ఇక కొంత మంది రాజన్న(రాజశేఖర్ రెడ్డి) ఫొటోతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని పేర్కొవడం గమనించదగ్గ అంశం.