సోషల్‌ మీడియాలో మరింత ముదిరిన టీడీపీ, వైసీపీ వార్‌

-

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్ మరింత ముదిరింది. తాజాగా, సోషల్ మీడియాలో వైసీపీ విమర్శనాస్త్రాలు సంధించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తన అరెస్ట్ ను రాజకీయం చేసి ప్రజల్లో సానుభూతి పొందాలని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశాడని వెల్లడించింది. “చంద్రబాబు అరెస్ట్ ను అడ్డుకునేందుకు ఆయన న్యాయవాదులు చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. సమయాన్ని సాగదీసేలా వరుసగా పిటిషన్లు వేశారు. న్యాయమూర్తి రిమాండ్ విధించినా జైలుకు తరలించకుండా అడ్డుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేశారు. కానీ వాటన్నింటిని ఛేదించిన సీఐడీ అధికారులు చంద్రబాబును రాజమండ్రి కేంద్ర కారాగానికి తరలించారు” అని వైసీపీ తన పోస్టులో వివరించింది.

మంత్రి రోజా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును మరోమారు టార్గెట్ చేశారు. బంద్ అన్నారు గా… చంద్రబాబు సొంత జిల్లాలో, సొంత సంస్థ అయిన హెరిటేజ్, హెచ్ ఎఫ్ లిమిటెడ్ ఎందుకు మూయలేదు చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు నిన్ను లోపలేస్తే మీ సంస్థలు మాత్రం వ్యాపారాలు చేసుకుని సంపాదించుకోవాలి ఇతరులు మాత్రం నష్ట పోవాలి అంతేగా అంటూ వైసిపి మంత్రి రోజా టార్గెట్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version