ఎలుక దెబ్బకు వెనుదిరిగిన యడియూరప్ప.. ఏం జ‌రిగిందంటే..?

-

కర్ణాటక విధానసౌధలో ఎలుకలు పెద్ద సమస్యగా మారాయి. తాజాగా, ఓ చచ్చిన ఎలుక దెబ్బకు ఏకంగా ముఖ్యమంత్రి యడియూరప్ప కార్యక్రమమే రద్దైంది. విధానసౌధలో చోటుచేసుకుంది. శక్తికేంద్రంగా పిలువబడే విధానసౌధలోని మూడవ అంతస్తు 313లో నిత్యం సమీక్షలు, అధికారుల కీలక సమావేశాలు జరుపుతారు. అదే రీతిన సోమవారం వివిధ కమిటీలతో ముఖ్యమంత్రి యడియూరప్ప సమావేశాలు జరిపేలా కార్యక్రమాలను రూపొందించారు. అయితే, ఆ గదిలో ఎక్కడో ఓ చచ్చిన ఎలుక ఉండటంతో గదంతా భరించలేని కంపు కొడుతోంది.

అయినా, అప్పటికే అక్కడకు చేరుకున్న అధికారులు కంపును భరిస్తూనే సీఎం కోసం వేచి చూస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆ సమావేశపు గదిలోకి యడియూరప్ప ప్రవేశించారు. కంపుకు ఆయన తట్టుకోలేకపోయారు. వెంటనే బయటకు వచ్చి… గది పర్యవేక్షకులు, సంబంధిత అధికారులపై విరుచుకుపడ్డారు. విధి నిర్వహణలో ఇంత నిర్లక్ష్యమా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత సీఎం పేషీచి చేరుకుని, అక్కడ సమీక్షలను నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news