తెలంగాణలో ఎల్లో అలెర్ట్‌ జారీ…. ఐదు రోజులు వర్షాలు

-

తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రాబోయే కొద్ది గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముదని పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

సోమవారం నుంచి మే 4వ తేదీ వరకు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈరోజు కరీంనగర్‌, రాజన్న సిరిసిల్లతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాపాతం నమోదైంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version