బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా గులాబీ నేతలతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఈ మీటింగ్‌కు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ మాజీ,తాజా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహిస్తున్న పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను జయప్రదం చేసేలా నేతలకు కేసీఆర్ కీలక దిశానిర్దేశం చేశారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశం నిర్వహించుకోవాలని సూచించారు. బహిరంగ సభను పెద్దఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేశామని.. ఒక్కో నియోజకవర్గం నుంచి లక్ష మందికి తగ్గకుండా సభకు జనసమీకరణ చేయాలని కేసీఆర్ వారికి సూచించినట్లు తెలిసింది.