బ్రేకింగ్ : ఎస్పీ, డీఎస్పీ సహా ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసిన యోగి !

-

హత్రాస్‌ రేప్ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగడంతో యూపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు నివేదికను పరిశీలించాక… ఎస్పీ, డీఎస్పీతో పాటు మరో ముగ్గురు పోలీస్‌ అధికారులను సస్పెండ్‌ చేయాలని పోలీస్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఆదేశించారు. వాళ్లందరికీ నార్కో, పాలిగ్రాఫ్‌ పరీక్షలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.

హ‌త్రాస్‌లో 19 ఏళ్ల ద‌ళిత బాలిక గ్యాంగ్ రేప్, హ‌త్య ఆ తరువాత ఆమె శవాన్ని దహనం చేసే దాకా యూపీ పోలీసులు వ్యవ‌హరించిన తీరుపై సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. ఈ క్రమంలో తన ప్రభుత్వంపై వస్తోన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని యోగి తెలిపారు. యూపీలో త‌ల్లులు, కూతుళ్ల‌పై చెడు ఆలోచ‌న‌లు వ‌స్తేనే భ‌య‌ప‌డేలా ఓ ఊదాహ‌ర‌ణ‌గా నిలిచేలా చ‌ర్య‌లు తీసుకుంటామాని ఆయన హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version