బాహుబలి సినిమాలో కిలికిలి భాష అనేది హైలెట్. సినిమా మొదటి భాగం సెకండ్ ఆఫ్ లో ఈ భాష సినిమాకు ప్రధాన అసెట్. మాహిష్మతి సామ్రాజ్యానికి, కాలకేయులకు మధ్య జరిగే మహా యుద్ధం కి ముందు కాలకేయ నాయకుడు ఈ భాషలో మాట్లాడతాడు. ఈ భాష చాలా మందికి అప్పుడు ఆశ్చర్యంగా ఉన్నా ఆ భాష కోసమే సినిమా చూసారు కొంత మంది. ఆ రేంజ్ లో హిట్ అయింది ఆ భాష.
సినిమాలో ప్రత్యేకత కూడా అదే అని చెప్పవచ్చు. భయంకర రూపంలో ఉన్న కాలకేయ నాయకుడు మాట్లాడిన భాష హైలెట్. ఆ భాష జనాలు ఎప్పుడు వినలేదు. ఇప్పుడు అలాంటి భాషకు లిపి కనిపెట్టారు. రచయిత మదన్ కార్కి సినిమా కోసం సృష్టించిన భాషకు . కికి వాల్డ్‌నే క్రియేట్ చేసి 3000కు పైగా పదాలు, వ్యాకరణంతో ప్రపంచంలోనే చిన్నదైన, సులభమైన భాషకు ప్రాణం పోశాడు.
భాషను నేర్చుకోడం కోసం (kiliki.in) వెబ్‌సైట్, యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. సైట్‌లోకి వెళ్లి ఇంగ్లీష్‌లో పేరు టైప్ చేస్తే చాలు, కిలికి భాషలో ఆ పేరు ప్రత్యక్షమవుతుంది. మదన్ కార్కిని ప్రశంసిస్తూ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేసారు. మీరు అందరు కూడా కిలికి భాష(బాహుబలి భాష)ను నేర్చుకోవచ్చని ట్వీట్ లో పేర్కొన్నారు. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా మీరు నిర్విరామంగా పనిచేసి కనిపెట్టిన భాషను ఇప్పుడు అందరు కూడా నేర్చుకోబోతున్నారని, మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉందని పోస్ట్ చేసారు.