ప్రజా క్షేత్రంలో మీకు శిక్ష తప్పదు – ఈటెల రాజేందర్

-

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్ ని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని గ్రామస్తులు అడ్డుకున్నారు. వరద ప్రాంతాల పరిశీలనకు ఎంపీ వస్తున్నారని తెలుసుకున్న ఏర్దండి వాసులు ఆయన ముందు నిరసన తెలిపేందుకు యత్నించారు. తమ గ్రామానికి చెందిన ఓ భూ వివాదాన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన అరవింద్ ఆ తర్వాత దాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ కాన్వాయ్ కి రోడ్డుకు అడ్డంగా నిలుచున్నారు.

అయితే పోలీసులు గ్రామస్తులను పక్కకు తప్పించి ఎంపీ కాన్వాయ్ ని ముందుకు పంపించారు. ఈ సమయంలో అరవింద్ వెంట వచ్చిన బీజేపీ శ్రేణులు గ్రామస్తులు పై దాడికి దిగారని వార్తతో గ్రామస్తులు ఒక్కసారిగా రోడ్డుపైకి చేరుకున్నారు. వరద ప్రాంతాల్లో పరిశీలన ముగించుకొని తిరిగి వస్తున్న ఎంపీ కాన్వాయ్ నీ గ్రామస్తులు మరోమారు అడ్డుకున్నారు. అయితే పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేయగా కాన్వాయ్ పై గ్రామస్తులు దాడికి దిగారు.

ఈ దాడిలో కాన్వాయ్ లోని ఓ కారు రెండు అద్దాలు పగిలిపోయాయి.కాగా ధర్మపురి అరవింద్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఇవి ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే సత్తా లేక చేస్తున్న చర్యలనీ అన్నారు. బిజెపి కి వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక దాడులకు దిగడం హేయమైన చర్య అని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version