చాలా మందికి స్పెషల్ గా కనపడాలని ఉంటుంది. అందరిలా కాకుండా కాస్త స్పెషల్ గా ఉండాలని చూస్తూ ఉంటారు. మీరు కూడా ప్రత్యేకంగా కనపడాలని చూస్తున్నారా..? అందరి దృష్టి మీ మీద పడాలని ప్రత్యేకంగా మీరు ఉండాలని అనుకుంటే కచ్చితంగా వీటిని మీలో ఉంచుకోండి. అప్పుడు పక్కా మీరు స్పెషల్ గా కనబడతారు.
మీరు నమ్మే విలువలు:
మీరు నమ్మే విలువలు మీ నమ్మకాలు సమాజంలో మిమ్మల్ని స్పెషల్ గా మారుస్తాయి అలానే మంచి గుర్తింపు కూడా మీకు లభిస్తుంది.
లక్ష్యాన్ని పెట్టుకోండి:
మీరు క్లియర్ గా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి అప్పుడు కచ్చితంగా మీరు అందరికంటే స్పెషల్ గా కనపడతారు పైగా ఇది మీ జీవితానికి హెల్ప్ అవుతుంది కూడా.
నిజాయితీతో ఉండడం:
నిజాయితీగా ఉండడం చాలా మంచి లక్షణం. మీ బలహీనతల్ని గుర్తించండి. అలానే మీ తప్పుల్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయండి.
పాజి టివ్ గా ఉండడం:
మీరు పాజిటివ్ గా ఉంటే మీరు అందరికంటే స్పెషల్ గా కనపడతారు. పైగా నలుగురు మిమ్మల్ని గౌరవిస్తారు కూడా.
మంచి కమ్యూనికేషన్:
మంచి కమ్యూనికేషన్ ఉంటే మీరు అందరికంటే డిఫరెంట్ గా కనబడతారు అలానే ఎదుటివారు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు కూడా.
నేర్చుకోండి:
మీరు కొత్త విషయాలని నేర్చుకోండి కొత్త విషయాలని నేర్చుకోవడానికి వెనకడుగు వేయొద్దు నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని మీరు నేర్చుకుంటే అందరికంటే స్పెషల్ గా ఉండొచ్చు.
క్రియేటివిటీ:
క్రియేటివిటీ కూడా మిమ్మల్ని డిఫరెంట్ గా చూపించేందుకు అవుతుంది.