యూరియా దొరకలేదని యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంట దిగుబడి లేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు మరొక రైతు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామవరం గ్రామంలో తండ్రి మరణాంతరం తనకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు ఉడుత అఖిల్(22).

వారం రోజులుగా యూరియా బస్తా లభించకపోవడంతో, దిగుబడి రాదని, పెట్టుబడికి చేసిన రూ.5 లక్షల అప్పు తీర్చలేనని మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు యువ రైతు అఖిల్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో తనకున్న నాలుగెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేశారు భూక్య శంకర్ నాయక్(55). సాగు చేసిన వరి పంటకు ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో, అప్పులు ఎలా తీర్చాలో తెలియక పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు రైతు శంకర్ నాయక్.