యాదాద్రిలో దారుణం.. యువతి గొంతు కోసి..

-

ఎక్కడ చూసిని స్రీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా యాదాద్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై దుండగలు కత్తితో దాడి చేశారు. మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో శుక్ర‌వారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తు తెలియని ఆగంతకులు క‌త్తితో దాడి గొంతు కోసి పారిపోయాడు. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న బాధితురాలిని చికిత్స నిమిత్తం భువ‌న‌గిరి ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఎలుగు యమున వలిగొండ మండలం లోతుకుంట గ్రామంలోని మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటుంది.

శుక్ర‌వారం రాత్రి ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న యమునపై మాస్క్ ధరించి బైక్‌పై వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులు క‌త్తితో ఆమె గొంతు కోశారు. క్ష‌ణాల్లోనే అక్క‌డ్నుంచి ఆ ఇద్ద‌రు ప‌రారీ అయ్యారు. బాధితురాలి కేకలు, అరుపులు విని ఇరుగు పొరుగు వారు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అనంత‌రం ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్ర‌స్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. యువతిపై దాడి ఘటన సమాచారం తెలుసుకున్న మోత్కూర్ ఎస్సై వి జానకి రామ్ రెడ్డి సిబ్బందితో దత్తప్పగూడెం గ్రామాన్ని సందర్శించారు. యువతిపై దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version