U-19 World Cup : ఐదోసారి కొట్టేశారు.. ప్ర‌పంచ క‌ప్ నెగ్గిన యంగ్ టీమిండియా

-

అండర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో యంగ్ టీమిండియా అద‌ర‌కొట్టింది. ఇంగ్లాండ్ తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో విజ‌యదుందిబి మోగించింది. దీంతో అండ‌ర్-19 ప్ర‌పంచ్ క‌ప్ ను రికార్డు స్థాయిలో ఐదు సార్లు కైవసం చేసుకున్న‌ జట్టుగా భార‌త్ నిలిచింది. కాగ ఈ వ‌రల్డ్ క‌ప్ లో య‌శ్ ధుల్ సేన ఒక్క మ్యాచ్ లో కూడా ఓట‌మి పాలు కాలేదు. ఆడిన ప్ర‌తి మ్యాచ్ లో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తూ.. క‌ప్ కొట్టి టోర్నీని విజ‌య వంతంగా ముగించింది.

కాగ ఇంగ్లాండ్ తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ను భార‌త బౌల‌ర్లు ఊపిరి పీల్చుకోనివ్వ‌లేదు. వ‌రుస‌గా వికెట్లు తీస్తూ.. ఒత్తిడి పెంచారు. దీంతో 44.5 ఓవ‌ర్లో కేవ‌లం 189 ప‌రుగులకే ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు కుప్ప‌కూలారు. టీమిండియా పేస‌ర్లు.. రాజ్ బవా 5 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. అలాగే త‌న ప‌ది ఓవ‌ర్ల స్పెల్ లో కేవ‌లం 31 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ప్ర‌త్య‌ర్థిని క‌ట్టడి చేశాడు. అలాగే ర‌వి కుమార్ 4 వికెట్లు ప‌డ‌గొట్టి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ వెన్ను విరిచాడు.

అనంత‌రం 190 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ కు ఆదిలోనే షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ ర‌ఘువంశీ (0) రెండో బంతికే అవుట్ అయ్యాడు. కాని తెలుగు కుర్రాడు షేక్ రషీద్ (50) తో పాటు నిశాంత్ సింధు (50), రాజ్ బ‌వా (35) పరుగులు చేసి టీమిండియాను విజ‌య తీరాలకు చేర్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version