ప్రపంచ క్రికెట్ లో 1000 వన్డే మ్యాచ్ లు ఆడిన జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పడానికి సిద్దం అవుతుంది. 1974 లో మొదటి వన్డే మ్యాచ్ ను టీమిండియా ఆడింది. కాగ దాదాపు 47 సంవత్సరాల తర్వాత టీమిండియా 1000 వ వన్డే మ్యాచ్ ఆడబోతుంది. టీమిండియాతో వెస్టిండీస్ వన్డే, టీ 20 సిరీస్ లు ఆడటానికి ఇండియా వచ్చింది. కాగ వన్డే సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కాగ చాలా రోజుల తర్వాత ఈ సిరీస్ ద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ మైదనాంలోకి అడుగు పెట్టనున్నాడు.
కొత్త బాధ్యతలు చేపట్టిన కోచ్ ద్రావిడ్ – కెప్టెన్ రోహిత్ శర్మ కాంబినేషన్ లో ఈ సిరీస్ జరగడంతో అందరి కల్లు ఈ సిరీస్ పైనే ఉన్నాయి. సిరీస్ ప్రారంభం కాకముందే.. టీమిండియా కు ఎదురు దెబ్బ తిగిలిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ తో పాటు శ్రేయస్ అయ్యార్, రుత్ రాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ కు కరోనా సోకడంతో వీరు మొదటి వన్డే మ్యాచ్ కు దూరం గా ఉంటున్నారు. కాగ ఓపెనర్ గా రోహిత్ శర్మతో ఇషన్ కిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాగ మిడిల్ ఆర్డర్ లో సూర్య కుమార్ యాదవ్ తో పాటు దీపక్ హుడా లకు ఛాన్స్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బౌలింగ్ విభాగంలో దీపక్ చాహార్ తో పాటు సిరాజ్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ధ కృష్ణలు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. కాగ ఈ మ్యాచ్ గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది.