కరోనా దెబ్బకు వీర్యం బ్యాంకులకు క్యూ కట్టిన యువకులు…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తుంది. అగ్ర రాజ్యం అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 28 వేల మంది మరణించగా… 7 లక్షలకు చేరువలో కరోనా మరణాలు ఉన్నాయి. అక్కడ ప్రధాన నగరాల్లో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీనితో జనాలకు ఇప్పుడు కొత్త భయం మొదలయింది. కరోనా వైరస్ సోకితే వీర్య కణాల ఉత్పత్తి అనేది తగ్గుతుందని ప్రచారం మొదలయింది.

దీనితో అక్కడ యువకులు, పురుషులు ఇప్పుడు వీర్యాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్పెర్మ్‌బ్యాంకులకు ఇప్పుడు అక్కడి పురుషులు బారులు తీరుతున్నారు. ఈ పరిణామంతో గత కొన్ని వారాల వ్యవధిలోనే అమెరికాలో స్పెర్మ్‌ సేకరణ కిట్ల అమ్మకాలు 20 శాతం పెరిగాయని అక్కడి అధికారులు చెప్పారు. లైంగిక సంపర్కంతో కరోనా వ్యాపించదని ఇటీవల చైనాలో నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది.

వీర్యకణాల ఉత్పత్తిపై దాని ప్రభావం ఉంటుంది అనేది మాత్రం స్పష్టత లేదు. ఫ్రాన్స్‌లో జరిగిన మరో అధ్యయనంలో జ్వరంతో వీర్యం ఉత్పత్తి క్షీణించే అవకాశం ఉందని వైద్యులు గుర్తించారు. చలనం కాస్త తగ్గుతుందని సంతానంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని భయం వ్యక్తమవుతుంది. వైరల్‌ వ్యాధులతో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గదని శాస్త్రవేత్తలు చెప్తున్నా జనాలు మాత్రం భయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version