మకర సంక్రాంతి పండు సందర్బంగా బీసీ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. ‘సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు, పాడిపంటలతో రైతులు జరుపుకునే పండుగ. రైతన్నలందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని, ప్రజల జీవితాల్లో ఈ సంక్రాంతి పండుగ సుఖసంతోషాలను నింపాలి. ప్రజలు సిరి సంపదలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలి. సంస్కృతి సాంప్రదాయాలు పరిమళించే ఈ సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలతో ప్రతి ఇంటా పండగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలి’ మంత్రి పొన్నం ఆకాంక్షించారు.