మీ విండోస్ 10 పీసీ స‌డెన్ గా స్లో అయిందా ? కార‌ణం ఇదే..!

-

సాప్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన విండోస్ 10 పీసీ యూజ‌ర్లు ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. విండోస్ 10కు ఇటీవ‌లి కాలంలో మైక్రోసాఫ్ట్ అనేక అప్‌డేట్స్‌ను విడుద‌ల చేసింది. అయితే అప్‌డేట్స్ ఇన్‌స్టాల్ చేస్తే పీసీలు చాలా వేగంగా ప‌నిచేయాలి. ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌కూడ‌దు. కానీ విండోస్ 10 విష‌యంలో మాత్రం అందుకు రివ‌ర్స్‌గా జ‌రుగుతోంది.

విండోస్ 10 పీసీల‌ను వాడేవారు మైక్రోసాఫ్ట్ విడుద‌ల చేసిన అప్‌డేట్స్ ను ఇన్‌స్టాల్ చేసుకున్నా త‌మ పీసీ స‌డెన్‌గా స్లో అయింద‌ని, కొన్ని పాత సాఫ్ట్‌వేర్‌లు ప‌నిచేయ‌డం లేద‌ని పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఇటీవ‌లే ఇంకొన్ని అప్‌డేట్స్ ను మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసింది కానీ స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. ఇక దీనిపై త్వ‌ర‌లో మ‌రిన్ని అప్‌డేట్స్‌ను ఆ సంస్థ విడుద‌ల చేస్తుంద‌ని భావిస్తున్నారు. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు ఎలా ? అంటే..

మీ పీసీలో ర్యామ్ 8జీబీ ఉంటే అది తాజా విండోస్ 10 అప్‌డేట్స్ ఇన్‌స్టాల్ చేశాక అస‌లు సరిపోదు. కావాలంటే మీరు ఈ టిప్ ద్వారా మీ పీసీ ఎంత ర్యామ్ వినియోగించుకుంటుందో చెక్ చేసుకోవ‌చ్చు.

కంట్రోల్‌, ఆల్ట్‌, డిలీట్ అనే బ‌ట‌న్ల‌ను కీ బోర్డ్‌పై ఏక కాలంలో ప్రెస్ చేస్తే ఓ మెనూ వ‌స్తుంది. అందులో టాస్క్ మేనేజ‌ర్ అనే ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. దీంతో టాస్క్ మేనేజ‌ర్ విండో ఓపెన్ అవుతుంది. అందులో ప్రాసెసెస్‌, పెర్ఫార్మెన్స్‌, యాప్ హిస్ట‌రీ, స్టార్ట‌ప్‌, యూజ‌ర్స్‌, డిటెయిల్స్, స‌ర్వీసెస్ అనే ప‌లు ట్యాబ్స్ క‌నిపిస్తాయి. వాటిల్లో ప్రాసెసెస్ అనే ట్యాబ్‌ను ఎంచుకోవాలి. అందులో మెమొరీ అనే సెక్ష‌న్‌లో కొంత పర్సెంటేజ్ ఎప్పుడూ మారుతుంది. అంటే మీ పీసీ రియ‌ల్‌టైంలో ఉప‌యోగించుకునే ర్యామ్ ప‌రిమాణాన్ని అక్క‌డ శాతంలో చూపిస్తుంది. ఆ శాతం 50 నుంచి 60 మ‌ధ్య ఉంటే ఓకే. లేదంటే 70 శాతానికి పైగా ఉంటే వెంట‌నే మీ ర్యామ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. 8జీబీ ర్యామ్ ఉంటే ఇంకో 8జీబీ ర్యామ్ పెట్టుకోవాలి. లేదంటే మైక్రోసాఫ్ట్ విడుద‌ల చేసే అప్‌డేట్స్ కు మీ పీసీలో ర్యామ్ చాల‌దు. దీంతో పీసీ స‌డెన్‌గా స్లో అవుతుంది. ఇలా గ‌న‌క మీకూ జ‌రిగితే వెంట‌నే ర్యామ్ ను మార్చుకోండి. దీంతో పీసీ వేగంగా ప‌నిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version