గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు మీద యువకులు రెచ్చిపోయారు. కార్ రేసింగులు నిర్వహిస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. తెల్లవారుజామున శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు మీద కొందరు యువకులు కార్ స్టంట్ నిర్వహించారు.
నిర్మానుషంగా ఉన్న ప్రాంతాల్లో స్టంట్లు చేస్తూ హంగామా యువకులు సృష్టించారు. నడిరోడ్డుపై కార్లను వేగంగా డ్రైవ్ చేస్తూనే గింగిరాలు తిప్పారు. ఈ స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలు ఓఆర్ ఆర్ మీద గల సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.ఔటర్ మీద ఇటీవల పెట్రోలింగ్ తగ్గిపోవడం వల్లే మళ్లీ కొందరు యువత రేసింగులు మొదలెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డు మీద కార్ రేసింగులు నిర్వహిస్తున్న యువకులు
తెల్లవారుజామున శంషాబాద్ ఔటర్ లో కార్ స్టంట్ చేస్తున్న యువకులు
నిర్మానుషంగా ఉన్న ప్రాంతాల్లో స్టంట్ లు చేస్తూ హంగామా చేస్తున్న యువకులు
నడిరోడ్డుపైనే లక్జరీ కార్లతో స్టంట్ లు చేస్తున్న యువకులు pic.twitter.com/i9Pyhzi11Q
— Telugu Scribe (@TeluguScribe) February 9, 2025