భద్రాద్రి రాముడి పేరిట యూట్యూబ్ ఛానల్.. వీడియో వైరల్!

-

భద్రాద్రి రాముడి పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది ఆలయ కమిటీ. ఈ విషయాన్ని టెంపుల్ ఈఓ రమాదేవి అధికారికంగా వెల్లడించారు. ‘భద్రాద్రి దివ్యక్షేత్రం’ అనే పేరుతో ఈ యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులకు ఆలయంలో రోజువారీ క్రతువుల గురించి తెలిపేలా ఈ యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలు పోస్ట్ చేస్తామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.

ఈ క్రమంలోనే మొదటగా ఒక వీడియోను కూడా చిత్రీకరించారు. అందులో తెలుగు రాష్ట్రాల్లో భద్రాద్రి రాములవారికి ఉన్న భూముల వివరాలు, బంగారం, వెండి ఆభరణాల వివరాలను పేర్కొన్నారు. ఇక వీడియాలోని కంటెంట్ విషయానికొస్తే రాముల వారికి 1,300 ఎకరాల భూమి, 68 కిలోల బంగారం, 980 కిలోల వెండి ఉన్నాయని తెలిపారు. మొత్తం 20 నిమిషాల నిడివితో ఆ వీడియో ఉంది. దీనిని త్వరలోనే అప్‌లోడ్ చేయనున్నారు. అలాగే భద్రాద్రి ఆలయ ఉత్సవాలకు సంబంధించిన వీడియోలను కూడా ఈ యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేయనున్నట్లు ఈవో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version