యూట్యూబర్ సరయు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్ వీడియోల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని, ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఒక కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. కాకపోతే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం కొనసాగలేక పోయింది. ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా బిగ్ బాస్ ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న సరయు పై తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
యూట్యూబర్ సరియు రూపొందించిన ఒక వీడియో సమాజాన్ని కించపరిచేలా ఉంది అంటూ బంజర హిల్స్ పోలీస్ స్టేషన్ లో సరయు పై కేసు నమోదు అయ్యింది. మొదటగా సరయు మరియు ఆమె బృందం పై సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్లలో ఫిర్యాదు చేయగా, ఆ వీడియోను హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో చిత్రీకరించినట్టు తేలింది. దానితో ఈ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. వివరాల్లోకి వెళితే… సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ‘7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్’ కోసం వీరు ఒక వీడియో రూపొందించారు.
ఈ వీడియోను పోయిన సంవత్సరం ఫిబ్రవరి 25 వ తేదీన తమ యూట్యూబ్ ఛానల్ తో పాటు సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో సరయు, ఆమె బృందం తలకు ‘గణపతి బొప్పా మోరియా’ అని రాసి ఉన్న బ్యాండు ను ధరించారు. ఈ వీడియో మహిళలను, హిందూ సమాజాన్ని కించపరిచేలా ఉందని విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ను ప్రారంభించారు.