జగన్ కీలక నిర్ణయం.. ఆ రెండు ఛైర్మన్ పదవులూ మహిళలకే…

-

స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మొగినప్పటి నుంచి వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల ఎన్నికలు ఏకగ్రీవం కానుండటంతో జడ్పీ ఛైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలనే ఆలోచనలో వైసీప ప్రభుత్వం ఆలోచిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ పార్టీ కోసం ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేస్తున్న నాయకులకే అగ్రతాంబూలం ఇస్తున్నారు. అతి సామాన్య కార్యకర్తలు, అనేకమార్లు త్యాగాలు చేసిన నాయకులనే ఈ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా ఎంపిక చేస్తున్నారు. తాజాగా మరో రెండు జిల్లాల కు జిల్లా పరిషత్ ఛైర్మన్లను ఖరారు చేశారు సీఎం జగన్. అందులో ఒకటి గుంటూరు, మరొకటి తూర్పుగోదావరి జిల్లా. ఈ రెండు జిల్లాలు రాజకీయంగా చాలా పెద్ద జిల్లాలు. అంతేకాదు విస్తీర్ణంలో కూడా పెద్దవే. ఈ రెండు చోట్లా ఇద్దరు దళిత మహిళలనును జిల్లా పరిషత్ ఛైర్మన్లను చేయాలని జగన్ నిర్ణయించారు.

గుంటూరు జడ్పీ ఎస్సీ మహిళకు, తూర్పుగోదావరి జడ్పీ ఎస్సీ జనరల్ కు రిజర్వ్ అయ్యాయి. సీఎం జగన్ మాత్రం రెండు జిల్లాలకు దళిత మహిళలనే జడ్పీ ఛైర్మన్లు గా చేయాలని నిర్ణయించారు. ఇద్దరు మహిళా నేతలను కూడా ఎంపిక చేశారు. వీళ్లిద్దరి ఎంపికలోనూ సీఎం జగన్ తన మార్క్ ఏంటో చూపించారు. నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేస్తారన్న వైఎస్సార్ బ్రాండ్ ఎలా ఉంటుందో చూపించారు. ఎందుకంటే గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఆయన కత్తెర క్రిస్టినాను ఎంపిక చేశారు. క్రిస్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. తాడికొండ నియోజకవర్గం సమన్వయకర్తగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత 2019 లో ఆమెకు సీటు దక్కలేదు. ఆమె స్థానాన్ని ఉండవల్లి శ్రీదేవికి ఇచ్చారు. సీటు త్యాగం చేసినందుకు ఆమెను గుర్తుపెట్టుకుని ఇప్పుడు జిల్లా పరిషత్ ఛైర్మన్ చేయాలని నిర్ణయించారు. మరో వైపు తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎస్సీ జనరల్ అయ్యింది. ఈ జిల్లాలో ఎస్సీల నుంచి భారీగానే పోటీ ఉంది. అయితే ఇటీవల మాలకార్పొరేషన్ ఛైర్మన్ గా సీఎం జగన్ నియమించిన అమ్మాజీకి కూడా ఇప్పుడు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అమ్మాజీ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసినప్పుడు ఈమె కూడా జడ్పీటీసీకి రాజీనామా చేసింది. తుని విధ్వంసం కేసుల్లో ఈమెపై కూడా టీడీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టింది. అయినా పార్టీకోసం పనిచేసింది. ఈమె విధేయతను గుర్తించి సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ మాల కార్పొరేషన్ ఛైర్మన్ ను చేశారు. ఇప్పుడు అనూహ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో జడ్పీటీసీకి ఆమె నామినేషన్ వేశారు. దీంతో ఈమెకే జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం దక్కబోతుందన్నది బహిరంగ రహస్యంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version